కాంగ్రెస్ కౌన్సిలర్ ఎర్రగడ్డపల్లి అనసూయ కృష్ణ ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ పరిగి: మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని13వ వార్డులో డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డిని గెలిపించాలని 13వ వార్డు కౌన్సిలర్ ఎర్రగడ్డ పల్లి అనసూయ కృష్ణ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కనుక చేతి గుర్తుకు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.