కాంగ్రెస్ అభ్యర్ధి జారే ఆదినారాయణ ఇంటింటి ప్రచారం

– జారే ఇంటింటి ప్రచారం
– పట్టణ వాసులు బ్రహ్మరధం
నవతెలంగాణ – అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో కాంగ్రెస్ అభ్యర్ధి జారే ఆదినారాయణ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అశ్వారావుపేట పట్టణంలో మొగళ్ళపు చెన్నకేశవరావు, జూపల్లి రమేష్,కట్రం స్వామి దొర నేతృత్వం లో వ్యాపార సముదాయాలు లో, ఆయా యాజమాన్యాలను ముఖాముఖి గా ఓట్లు అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో- ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా, నార్లపాటి శ్రీను, సత్యవరపు బాలగంగాధర్, ప్రమోద్, ఎంపిటిసి వేముల భారతి, సర్పంచ్ రమ్య, ఉప సర్పంచ్ కేదార్ నాధ్ లు పాల్గొన్నారు.