నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొందూరు రఘువీర్ భారీ మెజారిటీతో గెలుపొందాలని శనివారం నల్లగొండ పార్లమెంట్ ఇంచార్జి పెరుమాళ్ల ఎల్లయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక తుమ్మడం కోట మైసమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్న మూడు లక్షల 50 వేల పైచిలుకు ముదిరాజ్ ఓటర్లు ఏకపక్షంగా కుందూరు రఘువీర్ కు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన అన్నారు. భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు. పూజలు నిర్వహించిన వారిలో హనుమంతు, యాదయ్య, సత్యనారాయణ, దుర్గారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.