నవ తెలంగాణ- ఆర్మూర్ : మండలం లోని గోవింద్ పెట్, చేపూర్, చేపూర్ కాలనీ గ్రామంలో గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గురువారం ప్రచారం నిర్వహించినారు. భారీ ఎత్తున బీజేపీ టిఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బట్టు నవీన్ మరియు దయానంద్ కార్తీక్ సునీల్ సందీప్ సచిన్ జెసిబి మోహన్, లక్ష్మణ్ ఎం రాజు దాసరి సతీష్ బి సుభాష్ సారంగి సతీష్ ప్రదీప్ కపిల్ డి సంజీవ్ లు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వీరికి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రచారంలో సతీమణి అనన్య, మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.