పుట్ట మధుపై కాంగ్రెస్ కుట్రలు

Congress conspiracies on Putta Madhu– బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ  నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మధును హత్య చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ నాయకుడు పుట్ట మధును హత్య చేసేందుకు కాంగ్రెస్ నాయకుల కుట్రలు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం అయ్యాయియని తెలిపారు. తమ నాయకుని ప్రాణాలకు భయం ఉంది కాబట్టి ప్రభుత్వం బద్రత కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వాలా యాదగిరి రావు, తోట రాజేశ్వర్ రావు,అక్కినవేని సుమన్, వెంకట్ రాజు, వేల్పుల  శేఖర్, తోకల సమ్మయ్య, పిలమరి నరేష్,పంతకాని సురేష్,మద్దెల లక్ష్మణ్, శివ సారయ్య, పాడ్య స్వామి పాల్గొన్నారు.