
ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం ఈ తరం కాదు అని,: ఎమ్మెల్యే మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కొన్ని రోజులుగా ముస్లింలను తిడుతూ ఇప్పుడు ముస్లింల మద్దతు తీసుకుంటున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, బిసి కులగనన, చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేకు మతిభ్రమించినట్టు భావిస్తున్నామని తెలిపారు. రోజుకో మాట పూటకు అబద్ధం మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాకేష్ రెడ్డి అని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం మానేసి కులచిచ్చు, మతసిచ్చు, పెట్టే విధంగా మాట్లాడడం రాకేష్ రెడ్డికి అలవాటనని వినయ్ రెడ్డి చెప్పారు. ఇప్పటికైనా సైకాలజిస్ట్ కు చూయించుకుని నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు సాధిస్తుందని తెలిపారు.