కలెక్టర్ రాజర్షిషాను పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించి, శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పట్టణంలో నెలకొన్న సమస్యలు, దానితోపాటు మిషన్ భగీరథ కి సంబంధించిన నీటి సరఫరా సమస్యలపై కలెక్టర్ కు విన్నవించారు. చాలారోజుల నుండి పట్టణంలోని కొన్ని వార్డులలో మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడం గురించి వివరించారు. స్వయంగా ఫోన్ చేసి చెప్పిన కేవలం ఆ రెండు రోజులు మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారని మళ్లీ సరఫరా నిలిపివేస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జహీర్ రంజాని, కౌన్స్ లర్లు ఆవుల వెంకన్న, సతీష్, కలల శ్రీనివాస్, భూమన్న, సంద నర్సింగ్ ఉన్నారు.