సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు

నవతెలంగాణా-ముత్తారం
ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామంలో సమ్మక్క సారలమ్మ, వేల్పమ్మలను కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం ప్రేమలత, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకొని, ప్రజలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. వారి వెంట బిసి సెల్‌ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్‌, యువజన కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బియ్యాని శివకుమార్‌, నాయకులు, కార్యకర్తలున్నారు.