కాంగ్రెస్‌ వద్దు బీఆర్‌ఎస్‌ పాలన ముద్దు

– ఖాళీ బిందెలతో నిరసన తెలిపే మహిళలు నేడు పూల వర్షంతో స్వాగతం
– వికారాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్‌
నవతెలంగాణ-మర్పల్లి
రైతుబంధు లాగోడి పైసలు ఆపే రాబందుల కాంగ్రెస్‌ పాలన వద్దు కేసీఆర్‌ సంక్షేమ పాలనే ము ద్దు అని వికారాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. మండలంలోని పిల్లిగుండ్ల, గుండ్లమర్పల్లి, నర్సాపూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లా డుతూ రైతుల సంక్షేమం కోసం కెేసీఆర్‌ ప్రభుత్వం రైతు బీమా, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడితే కాంగ్రెసు రాబందులు వాటిని అడ్డు కుంటున్నాయని ఆయన ఆరోపించారు. భగీరథ నీటితో మహిళల గోస తీర్చిన గులాబీ పార్టీని గుండె ల్లో పెట్టుకొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించా లని కోరారు. గతంలో నాయకులు పల్లెల్లోకి వస్తే ఖాళీ బిందెలతో నిరసన తెలిపే వారని నేడు అదే మ హిళలు బీఆర్‌ఎస్‌ నాయకులకు పూల వర్షం కురిపి స్తున్నారు అన్నారు. ఆయా పార్టీలకు చెందిన నాయ కులు ఎమ్మెల్యే ఆనంద్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో సర్పంచులు పాండు, శివకు మార్‌, పుష్పలత పద్మకర్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్య క్షుడు శ్రీకాంత్‌ రెడ్డి ఆయాగ్రామాల సర్పంచులు, ఎం పీటీసీ సభ్యులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు