కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలో గురువారం జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను గెలిపించాలని, పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని, చేతి గుర్తుకు ఓటు వేసి ,కాంగ్రెస్ ను గెలిపిద్దామని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నామాల రవీందర్, ఎం గోపి, జగన్, చాత్రబోయిన బాలయ్య, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.