బోర్గం (పీ) గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని బోర్గాం (పి) గ్రామంలో ఆదివారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని గ్రామంలోని వివిధ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా చెప్పింది చేస్తుందని ఇప్పటికే ఆరు గ్యారెంటీల లో భాగంగా ఐదు గ్యారంటీలను ఇప్పటికి అమలు చేసిందని రుణమాఫీ కూడా అతి త్వరలో చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కర్షక ప్రభుత్వమని పేదల ప్రభుత్వమని మిగతా పార్టీల లాగా దోచుకోవడం దాచుకోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదని, కేవలం సంక్షేమం ప్రజల శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచిస్తుందని వారు తెలిపారు, బిజెపి మాటలు బిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దని కేవలం వారు అద్దెకు ఉండే నాయకులని ఎలక్షన్ సమయంలో మాత్రమే మీకు కనిపిస్తారని ఎలక్షన్ దాటిన వెంటనే ఎక్కడికి వెళ్తారు వారికే తెలియదని కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటారని వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారని వారు తెలిపారు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో మన నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడుస్తుందని  అదేవిధంగా ఆయనకు  తోడుగా మన ప్రియతమా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధిలో మన గ్రామంతో పాటు మన జిల్లా కూడా దూసుకుపోతుందని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సడక్ శేఖర్ , కాంగ్రెస్ పార్టీ మత్స్యకార సంఘం అధ్యక్షుడు పి శ్రీనివాస్, అనిల్ రెడ్డి, అశోక్, పి శ్రీనివాస్, సుదర్శన్, శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.