– బీజేపీ జిల్లా కార్యదర్శి గుందన్నగారి వెంకటరెడ్డి ఆరోపణ
నవతెలంగాణ-చేవెళ్ల
ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా కార్యదర్శి గుందన్నగారి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆదివారం చేవెళ్ల మం డల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధరణి సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రకటన కాగితాలకే పరిమితమైందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు ఏమైందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫె స్టో ఒట్టి బూటకమన్నారు. రాష్ట్రంలో అమలు చేయలేకపోతున్న పథకాలను దేశవ్యాప్తంగా అమ లు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసమే హామీలిస్తున్నారని మండిపడ్డా రు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబు తారన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర సోమవారం చేవెళ్ల నియోజకవర్గంలోకి అడుగుపె డుతుందని తెలిపారు. నవాబుపేట మండలంలోని పూలపల్లి, నారెగూడ, గంగ్యాడ, ఎల్లకొండ, మైతా ప్‌ఖాన్‌గూడ గ్రామాల్లో ఆయన పర్యటిస్తారని, కార్య కర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అలాగే మొయినాబాద్‌లోని జేపీఎల్ గార్డెన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు బూత్ స్థాయి కార్యకర్తల పార్లమెంటు సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు వెంక ట్రాంరెడ్డి, శర్వలింగం, నాగరాజు, కృష్ణ, అమరేం దర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.