– కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలను ప్రతీ గడపకు తీసుకెళ్లాలి
– ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ
– కేసీఆర్, హరీశ్‌రావులకు కాంగ్రెస్ సత్తా చూపిస్తాం
– మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
– కాంగ్రెస్ అడ్డా.. మెదక్ గడ్డ
– మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
– అట్టహాసంగా రుద్రారం గణేష్ గడ్డ దేవాలయంలో ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు
నవతెలంగాణ-పటాన్‌చెరు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గెలిచిన మెదక్ గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండాను ఎగురవేయబోతున్నామని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానం లోఎన్నికల ప్రచార రథాలకు ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడు తూ.. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌ను కాంగ్రెస్ పార్టీ ఛాలెం జ్‌గా తీసుకున్నదన్నారు. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ సెగ్మెంట్‌లో ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటేలా ప్రభుత్వ ఆరుగ్యారెంటీ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్త సైనికు డిలా సమరభేరి మోగించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముం దుకు వెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మ కంతో మెదక్ ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత ను తనకు అప్పగించారన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశా రు. రేపటి నుంచి ప్రచారం ముమ్మరం కానుందని, ఎన్ని కల్లో విజయకేతనం ఎగురవేసి, సంబురాలు జరుపు కునేం దుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు హీత బోధ చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే పోటీ..
– మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
ఈ ఎంపీ ఎన్నికలలో మెదక్ పార్లమెంటు పరిధిలో బిఆర్‌ఎస్ కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని, ఇంకో పార్టీ పేరు కూడా పలకవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా జీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎమోషన్లకు పోయి ఆ పార్టీ వ్యక్తిని గిల్లవద్దని కార్యకర్తలకు సూచించారు. బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని, అత ని గెలుపు ఎంతో అవసరమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిద్దామన్నారు.
కాంగ్రెస్ అడ్డా.. మెదక్ గడ్డ
– మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అడ్డా అని మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీకి అరుదైన అవకాశం దక్కిందని, మిగతా అభ్యర్థులు ఇద్దరు కూడా అగ్రవర్ణ కులాలకు చెందిన వారేనని పేర్కొ న్నారు. ఇందిరా ప్రాతినిధ్యం వహించిన ఈ మెదక్ సీటుపై కాంగ్రెస్ జెండా ఎగరేసేంతవరకు నిద్రపోయేది లేదన్నారు. ఊహించని విధంగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటా మని మైనంపల్లి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పటాన్ చెరు అసెంబ్లీ ఇంచర్జ్ శ్యామ్ గౌడ్, పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇం చార్జ్‌లు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మున్సిపల్, పట్టణ, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.