
సత్తుపల్లి గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం, సత్తుపల్లి ని జిల్లా చేయడం ఖాయం అని సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కొండూరు సుధాకర్ తేల్చి చెప్పారు. శనివారం స్థానిక ఆయన క్యాంప్ కార్యాలయం లో కాంగ్రెస్ ముఖ్య శ్రేణులు తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కొండూరు మాట్లాడుతూ మరో 50 రోజులలో జరగబోయే నియోజకవర్గ ఎన్నికలలో ప్రజల సనపూర్ణ మద్దతుతో, నియోజకవర్గ కాంగ్రెస్ పెద్దలు అయిన సంభాని, తుమ్మల, పొంగులేటి, మువ్వా ఆశీస్సులతో ఈ ఎమ్మెల్యేని ఓడించి పాలేరు పంపించి, సత్తుపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగర వేస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీ గత తొమ్మిదిన్నర ఏళ్లుగా దోపిడీ తప్ప, రాష్ట్ర, ప్రజల అభివృద్ధి చేసింది మాత్రం శూన్యం అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా తాను చేపట్టిన పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ పాదయాత్రతోనే నియోజక వర్గ ప్రజల పైన, అభివృద్ధి పైన అధికార బిఆర్ఎస్ ప్రభుత్వానికి గత ఇన్నాళ్లుగా గుర్తుకు రాని సంక్షేమ పథకాలన్నీ గుర్తుకు వచ్చి ఓటమి భయంతో ఎన్నికలముందు హడావుడిగా,జోవోలు, మంజూరు పత్రాలు ప్రజలముందుకి తీసుకొచ్చి, ప్రజల్ని మోసం చేసే పనిలో వున్నారన్నారు. ఎనిమిది రోజులలో 140 కిలో మీటర్లు కొనసాగిన ఈ మహా పాదయాత్ర పార్టీ పెద్దల, ప్రజల సంపూర్ణ మద్దతితో పాటు, అధికార పార్టీ గత పాలనలో ప్రజల పడ్డ కష్టాలు, నష్టాలు ఎన్నో తెలుసుకోగాలిగనన్నారు. పేదల కు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, పింఛన్లు, నిరుద్యోగ ల ఆత్మ హత్యల ఘోష, ప్రస్తుతం రైతులు కరెంట్ కోతలతో,నాగార్జున సాగర్ జలాలు విడదలు చేసి రైతంగాన్ని ఆదుకోక పొతే ఆందోళన తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరిక లుతో జలాలు విడదలు చేయడం, గత మూడు నెలలు క్రితం, నియోజకవర్గానికి 1100 దళత బంధు యూనిట్లు మంజూరు చేసి కూడా పంపిణీ చేయకుండా అడ్డుకున్న దళిత వ్యతిరేకి సండ్ర వెంకట వీరయ్య అని ధ్వజ మెత్తారు. సింగరేణి బ్లాస్టింగ్ బాధితుల గోడు, గత ఎన్నికలు ముందు సత్తుపల్లి జిల్లాను చేస్తానన్న పెద్దలు,బి ఆర్ ఎస్ ప్రభుత్వం మారసిన, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి గడ్డపైన జెండా ఎగరవేయడం ఖాయం అధికారం చేపట్టిన 100 రోజులలో ఆరు గ్యారంటీ పథకాలు అములు తో పాటు, సింగరేణి నిధులు 100 కోట్ల తో భాధితులను ఆదుకుంటుందని, అలాగే సత్తుపల్లి ని జిల్లాను చేయడం కూడా ఖాయం అని కొండూరు ఆశా భావం వ్యక్తం చేస్తూ, ఎన్నికలు ముందు అభివృద్ధి, మరోసారి అధికారం కోసం అమలు చేయలేని మేనిపెస్టో లతో, ముందుకొచ్చే అధికార బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్దంగా లేరని, తగిన బుద్ది చెప్పడం తప్పనిసరి అని కొండూరు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలరాణి, మందపాటి ముత్తరెడ్డి , ఉడతనేని అప్పారావు, కొత్తూరు కోటేశ్వరరావు, మందపాటి రవీంద్రారెడ్డి, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి , మాజీ జెడ్పిటిసి భాషా నాయక్ , గాదిరెడ్డి సుబ్బారెడ్డి తదితర ఆ పార్టీ ముఖ్య శ్రేణులు పాల్గొన్నారు.