యాదవ కులస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ..

– కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్ 
నవతెలంగాణ – వేములవాడ 
బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో  యాదవ సోదరులను గొర్రెల స్కీం పేరిట ఇబ్బందులకు గురి చేసి, మోసం చేసిందని, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సంఘసామి యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. యాదవ సోదరులతో డబ్బులు కట్టించుకొని గొర్రెలు పంపిణీ చేయకపోవడం బాధాకరమని మండిపడ్డారు,ఆ డబ్బులను తిరిగి యాదవ సోదరులకే చెల్లించే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.గత బిఆర్ఎస్ పార్టీ గొర్రెల స్కీం పేరిట 700 కోట్ల రూపాయల  స్కాం కు పాల్పడిందని, దానిపై ఇప్పటికే సిబిఐ, ఈడి విచారణ ప్రారంభించిందని,గతంలో గొర్రెల యూనిట్లకు డబ్బులు చెల్లించి, గొర్రెల యూనిట్లు  పొందని యాదవ సోదరులకు వారు కట్టిన డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో ఉన్న యాదవ సోదరుల డబ్బులను తిరిగి వారి ఖాతాల్లోకి బదలాయించే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతుందన్నారు, త్వరలోనే  ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట  జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కూరగాయల కొమురయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు  రాకేష్,ఫాక్స్ డైరెక్టర్ తోట రాజు, బీసీ సెల్ నియోజకవర్గ ఇంచార్జ్ అంబటి చంద్రశేఖర్, నాయకులు కూర దేవయ్య, ఖమ్మం గణేష్, వనపర్తి శంకర్,లింగంపల్లి కిరణ్, వస్తాడు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.