తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వం

నవతెలంగాణ- చేవెళ్ల
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమని తమిళనాడు ఎంపీ డాక్టర్‌ విష్ణు ప్రసాద్‌ అన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా వచ్చిన ఆయన ఆదివారం కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ గెలుపుపై సలహాలు సూచనలు అందించారు. ఆయన మాట్లాడుతూ…తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ అని పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ కార్డులు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, వికాసం, చేయూత పింఛన్లు, పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త 6 గ్యారంటీలను హామీలను ప్రతి గడపగడపకూ వివరించి గెలుపే లక్ష్యంతో పని చేయాలన్నారు. చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి పామేన భీమ్‌ భారత్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్తా కష్టపడి పని చేయాలన్నారు. సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్‌ చింపుల సత్యనారాయణ రెడ్డి, మండలాల అధ్యక్షులు వెంకటయ్య, వీరేందర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్లు పడాల ప్రభాకర్‌, మధుసూదన్‌ గుప్తా, సీనియర్‌ నాయకులు రవీందర్‌ రెడ్డి, బండారు ఆగిరెడ్డి, పాండు, మల్లేష్‌, పెంటయ్యగౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, మద్దెల శ్రీను, మంగలి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.