
– భారీ మెజార్టీ తో భూపతి రెడ్డి ని గెలిపించాలి..
– తెలంగాణ ఉద్యమ కారుడు కోదండరాం పిలుపు..
నవతెలంగాణ-డిచ్ పల్లి : బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటిలో విఫలమైందని, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎలాంటి లాభం చేకూర్చకుండా కల్వకుంట్ల కుటుంబం లబ్ధి పొందిందని,ఈ ఎన్నికల్లో సైతం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నాలు బిఅర్ఎస్ నాయకులు చేస్తున్నారని,కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన అరు గ్యారంటీ కార్డుల పథకాన్ని ఇవ్వడం పక్క అని, తెలంగాణా ఉద్యమ కారులు కోదండరాం అన్నారు.మంగళవారం ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ లోలం ఎల్లారెడ్డిపల్లి, అమ్సన్ పల్లి,గుట్ట కిందతండా, డోన్కల్, గౌరరం,లింగపుర్, వెంగలపాడ్, కొత్త కోరుట్ల తండా, తిర్మన్ పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.డోంకల్, గౌరరం కార్నర్స్ సమావేశలలోనిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి
పక్షాన కోదండరాం ఎన్నికల ప్రచారం లో పాల్గోని మాట్లాడుతూ దళిత బంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందని, అర్హులైన వారికి ఇవ్వకుండా పేదలకు, నిరుపేద దళితులకు, నీరుద్యోగులకు, రైతులకు, యువకులకు మోసం చేశారని ఆరోపించారు.2001నుండి డాక్టర్ భూపతి రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పై గ్రామ గ్రామన తిరుగుతూ రాష్ట్ర ఆవశ్యకత పై ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు చైతన్యం చేసినట్లు పేర్కొన్నారు. భూపతి రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఆరు గ్యారెంటీలను విన్నవిస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, ప్రజల బతుకులు మారాలని పిలుపునిచ్చారు.2018 ఎన్నికల సమయంలో కూడా ప్రజలకు కుల సంఘాలను బుట్టలో వేసుకోవడానికి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రతి గ్రామానికి ప్రోసెడింగ్ కాపీలు అందజేశారని, ఇచ్చిన ఆ కాపీలకు పనులు ఎక్కడ జరగలేదన్నారు.మరోసారి కుల సంఘాల పేరున ప్రొసీడింగ్ పత్రాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
ఎవరిని మోసం చేయడానికి ఈ పత్రాలు అందజేస్తున్నారని అయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన పలువురు ఎమ్మెల్యేలకు దళిత బందులో 30శాతం కమిషన్ తీసుకుంటున్నారని పేర్కొన్నాట్టుగానే జరుగుతుందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా చేసిన ఘనత బిఆర్ఎస్కే దక్కుతుందని వివరించారు. అదికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు ఇచ్చిన గత పదేళ్లుగా కాలేదన్నారు.దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్, రైతులకు సైతం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయకుండా ఎనిమిది గంటలే సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ముందస్తుగా ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలను ఆరు నూరైనా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో లోని ప్రతి పథకాన్ని అమలు చేసి చూపడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను అందుకుంటమన్నారు.లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నేటి వరకు అమలు కాలేదని, ఏదో నామే వాస్తే సగం మందికి రుణమాఫీ వచ్చిందని దీనిపై నోరు మెదపడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెడతామన్నారు.ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తోందని, ప్రజలు తమంతట తామే వేలాదిగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ స్కీములపైనే మొట్టమొదటి సంతకం చేయడం జరుగుతుందని తెలిపారు. రైతన్నలకు రెండులక్షల రుణమాఫీ చేసి చూపుతామని, 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, వృద్ధులు వితంతువులు, బీడీ కార్మికులకు పెన్షన్ 4వేల పెన్షన్ అందజేస్తామని, వీటిలో ఎలాంటి అనుమానం అవసరం లేదని అన్నారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం, వరి, ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ లో ప్రకటించిన వాటన్నింటినీ అమలు చేసి తీరుతా మన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తెలంగాణ రైతులు, ప్రజలు దగా పడ్డారని, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి పూర్వ వైభవం తెస్తామని అన్నారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు పూర్తి సబ్సిడీతో సహాయం, రెండు లక్షల ఉద్యోగాలు అందజేస్తామని, ఆరోగ్య శ్రీ పథకంలో 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామన్నారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు అయా గ్రామాల్లో బోనాలు,డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేశ్ రెడ్డి, దర్పల్లి మాజీ ఎంపీపీ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి,డిసిసి డెలిగేట్ వెంకటరెడ్డి, సూదకర్
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు పూర్తి సబ్సిడీతో సహాయం, రెండు లక్షల ఉద్యోగాలు అందజేస్తామని, ఆరోగ్య శ్రీ పథకంలో 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామన్నారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు అయా గ్రామాల్లో బోనాలు,డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేశ్ రెడ్డి, దర్పల్లి మాజీ ఎంపీపీ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి,డిసిసి డెలిగేట్ వెంకటరెడ్డి, సూదకర్
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, కర్స మోహన్, నాయకులు, ఎల్ ఐ సి గంగాధర్,ఎన్ ఎస్ యుఐ రూరల్ కన్వీనర్ ఆశిష్, నారాయణ,కార్యకర్తలు, మహిళలు , యువకులు పాల్గొన్నారు.