కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయాలి: బండ శ్రీశైలం  

నవతెలంగాణ – చండూరు
2023 శాసనసభ ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు.  శుక్రవారం గట్టుప్పల   మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలు వచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కూలీలకు రూ.12,000 వేల రూపాయలు, మహిళలకు రూ.2500  ఆర్థిక సాయం, కౌలు రైతులకు  వాన కాలం నుంచి రైతు భరోసా అమలు చేయాలన్నారు. పంటల  బీమా పథకం రైతాంగానికి ఉపయోగపడే విధంగా భీమా ప్రీమియాన్ని ప్రభుత్వం భరించి అమలు చేయాలన్నారు. ఆగస్టు లోపు  రెండు లక్షల  లోపు ఉన్న రుణాలు వెంటనే రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. ధరణి సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే ధాన్యానికి ఇతర పంటలకు బోనస్ ఇవ్వాలన్నారు.  విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ బకాయిలను విడుదల చేయాలన్నారు. రైతులకు విత్తనాలు ఎరువులు రుణ సౌకర్యం కల్పించాలన్నారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాళీ పోస్టులు అన్నిటిని భర్తీ చేయాలన్నారు. జూన్‌లో వ్యవసాయ ఖరిఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే వ్యవసాయ కొత్త రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకర్లను ఆదేశించాలని అన్నారు. గుంతలు పడిన గ్రామీణ అంతర్గత రోడ్ల మరమ్మతులు చేయాలని అన్నారు. వేసవిలో ఉపాధి పనులు చేసిన కూలీలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, ఖమ్మం రాములు,వల్లూరి శ్రీశైలం, మండల నాయకులు కర్నాటి తుకారం, పెదగాని నరసింహ, టేకుమట్ల కృష్ణ, శ్రీరాముల వెంకటేశం, పర్సబోని యాదగిరి,చిక్కుల సైదులు, ఆకారపు వెంకటేశం,రేవెల్లి సత్తయ్య,  తదితరులు పాల్గొన్నారు.