రైతులను రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Congress government's aim is to make peasants king– ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి

– ఎద్దుల బండి ర్యాలీ లో ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
రాష్ట్ర రైతులను రాజులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు శుక్రవారం అచ్చంపేటలో ఎద్దుల బండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మొదటగా లక్ష రుణం ఉన్న రైతులకు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని త్వరలోనే రెండు లక్షలు ఉన్న రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతు సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి అంకితభావంతో పని చేస్తున్నారని, గ్రామాలలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. రూ.31వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పై భారం పడినప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా తరఫున అచ్చంపేట నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గార్లపాటి శ్రీనివాసులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, న్యాయవాది రాజేందర్,  మాధవరెడ్డి, కాశన్న యాదవ్, ఉన్నారు.