నవతెలంగాణ – వలిగొండ రూరల్
గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం లోతుకుంటలో రూ.5 లక్షలు, నరసాయగూడెంలో రూ.5 లక్షలు, అరూర్ లో రూ.14 లక్షలు, వెంకటాపురం రూ.20 లక్షలు, టేకులసోమారంలో రూ.20 లక్షల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు ఐన నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని, గ్రామాలలో. అసంపూర్తీగా ఉన్న సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు నిర్మించడానికి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన 6 గ్యారెంటీ వాగ్దానాలను రెండు అమలు చేస్తున్నామని, మిగతా గ్యారెంటీలు అమలు చేయడానికి ఇటీవల ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించిందని, వాటిని వెంటనే అమలు పరుస్తామని అన్నారు. వేములకొండ గ్రామంలో పులి పల్పుల మల్లేశం నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు. టేకుల సోమవారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్, జెడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి, వైస్ ఎంపిపి బాథరాజు ఉమా బాల నర్సింహా, టిపిసిసి సెక్రటరీ కసుబ శ్రీనివాసరావు, ఎంపిటిసి లు పలుసం రమేష్ , కుందారపు యశోదా,పల్లెర్ల భాగ్యమ్మ, పసల జ్యోతి, సామ రాం రెడ్డి, నాయకులు కుంభం విద్యా సాగర్ రెడ్డి,కుంభం వెంకట పాపి రెడ్డి, చేగురి మల్లేశం, బోళ్ల శ్రీను, ఉపేందర్ బోస్, కంకల కిష్టయ్య, బత్తిని సహదేవ్, గరిస రవి, కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, కొత్త వెంకటేశం, కేశిరెడ్డి నీరజారెడ్డి, పులి పల్పుల రాములు, నారగోని పాండు, రేకల ప్రభాకర్, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ సుగుణాకర్, తదితరులు పాల్గొన్నారు.