కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయడం హర్షణీయం

– బీఎన్ఆర్కెఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అల్వాల కృష్ణ గౌడ్
నవతెలంగాణ – తొగుట
కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయడం హర్షణీయం బీఎన్ఆర్కెఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అల్వాల కృష్ణ గౌడ్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయడం అభి నందనీయం అని తెలిపారు. గతంలో అధికారం లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కులగణన చేయక పోవడం దురదృష్టకరం అన్నారు. బిసిలు తీవ్ర అన్యయనికి గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మా నం ప్రవేశ పెట్టడంతో బీసీలకు ఊరట కలిగిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి వెంటనే కుల గణన చేసి బీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయా లని డిమాండ్ చేశారు.