గిరిజనులకు నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ అండ..

– ప్రజలకు ఇచ్చిన 5 గ్యారంటీ లను అమలు చేసి తీరుతాం..
– నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి
– ఎంపీ ఆర్వింద్, మాజీ ఎంపీ కవిత  జిల్లా కు చేసింది శూన్యం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గిరిజనులకు నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా నిలిచిందని, రాబోవు రోజుల్లో కూడా ఎళ్ళవేళల మద్దతుగా ఉంటుందని, హైదరాబాద్ లోని తుక్కుగుడ లో శనివారం దేశ ప్రజలకు ఇచ్చిన 5 గ్యారంటీ హామీ లను అదికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని,ఎంపి ధర్మపురి అర్వీంద్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లా కు చేసింది శూన్యమని, మరోసారి ప్రజలకు అమలు చేయని హామీ లు ఇవ్వడానికి సిద్ధమయ్యారని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి,మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం ఆదివాసీ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ విమర్శించారు. మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను పునః ప్రారంబించడం కేవలం కేంద్రంతోనే సాధ్యమని, వీరిద్దరు నిర్లక్ష్యం వల్ల ఫ్యాక్టరీల పురోగతి లేదన్నారు. మీరంత ఆశీర్వదించి…. తనను ఎంపీగా గెలిపిస్తే ..చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి, రైతులు చెరుకు సాగుచేసేవిధంగా చూడటంతోపాటు, అనేక అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. అదివారం డిచ్ పల్లి మండలం లోని బర్దిపూర్ శివారులోని బృందావన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లోనిజామాబాద్   జిల్లా బంజార గిరిజన ఆత్మీయ సదస్సు సమావేశం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు నమ్మితే అన్ని రకాలుగా జనాన్ని మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడిందని గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యం లో గిరిజనులకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.రైతులకు రుణమాఫీ చేస్తే సోమరులు తయారు అవుతారని ప్రధాని మోదీ పేర్కొనడం సిగ్గుచేటని, మరి కోట్లాది రూపాలయను ఐడా వ్యాపారస్తులకు రుణమాఫీ చేయడం ఎంతవరకు సమాంజసమని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రధాని మోసం చేశారని గుర్తుచేశారు. భారాస, భాజపా పార్టీలతో అభివృద్ధి సాధ్యపడదన్నారు. కాంగ్రెస్ నే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనునందానం చేస్తామన్నారు. రైతులు, గల్ఫ్ కార్మికులు బీడీ కార్మికుల సమస్యలను పరిష్కారించడానికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. పసుపు బోర్డు పేరుతో ఎంపీ ఆర్వింద్ జిల్లాకు చేసింది శూన్యమేనన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు తను వెంట ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెప్పారు. దేశంలో మొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్తును అమలు చేసిన ఒక్క కాంగ్రెస్్క సాధ్యమయ్యిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని వివరించి ఓట్లు ఆడుగాలని సూచించారు.
కార్యకర్తలకు అండగా ఉంటాను: డాక్టర్ భూపతిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని 50 వేల మెజారిటితో గెలపించేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పిలుపు నిచ్చారు. ఎంపీలుగా పనిచేసిన ఇద్దరు జిల్లాను ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. పోటీలో ఉన్న అర్వింద్కు కవిత మాదిరిగానే ఆశాభంగం కలుగుతుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గోవర్దనైఫై పలు విమర్శలు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మనల మోహన్ రెడ్డి, తాహెర్ బిన్ హందన్, సీనియర్ నాయకులు అమృత పూర్ గంగాధర్, మోత్కురి నవీన్ గౌడ్,పోలసని శ్రీనివాస్, శేఖర్, శ్యాంసన్,  మండల నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు ఉన్నారు.