మేయర్ భర్త దండు శేఖర్ దాడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని నుడా చైర్మన్ కేశ వేణు తెలిపారు. ఈ మేరకు బుధవారం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నుడా చైర్మన్ కేశ వేణు ఇటీవల మేయర్ భర్త శేఖర్ పై జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో జరిగిన మేయర్ భర్త శేఖర్ కు జరిగిన సంఘటన కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని, అది కేవలం భూ వివాదాలతో జరిగిన సంఘటన అని ఆయన వివరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన భూములను మేయర్ భర్త శేఖర్ కబ్జా చేశాడనే ఉద్రేకంతో రసూల్ అనే వ్యక్తి మేయర్ భర్త పై దాడికి పూనుకున్నాడని, నిజానికి రసూల్ కు కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదని, వాస్తవానికి రసూల్ అనే వ్యక్తి శేఖర్ అనుచరుడని ,కేవలం భూ వివాదం విషయంలో కోపంతో శేఖర్ పై దాడి చేశారని ప్రజాప్రతినిధులు గాని స్థానిక ఎమ్మెల్యే గాని మాట్లాడే ముందు ఒక్కసారి విషయాలను గమనించాలని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం వారికి తగదని వాస్తవాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలని కేశ వేణు అన్నారు.