– బీఆర్‌ఎస్‌మోసపూరిత హామీలను నమ్మొద్దు
– కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీ స్కీంలను కచ్ఛితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం నల్గొండ పట్టణంలోని 47, 45, 43వ వార్డులలో మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, నల్గొండ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు ఆమేర్, ఆయేషా ఫర్హిన్ ఖలీల్‌తో కలిసి విస్తత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ మోసపూరిత హామీలతో పాలన సాగించిందే తప్ప నలగొండను అభివద్ధి చేయలేదని విమర్శించారు.నల్లగొండలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా పేద ప్రజలను వంచనకు గురి చేసిందని ఆరోపించారు.గత ఎన్నికల ముందు నల్లగొండను దత్తత తీసుకొని అభివద్ధి చేస్తానన్న సీఎం కేసీఆర్‌కు ఎవరు అడ్డుపడ్డారని, ఎందుకు అభివద్ధి చేయలేదని ప్రశ్నించారు.సీఎం కేసీఆర్ మరోసారి నల్లగొండ ప్రజలను మోసం చేయడానికి వస్తాడని, అతని మోసపూరిత మాటలు ఎవరు నమ్మవద్దని కోరారు.నియోజకవర్గంలోని రోడ్లు అధ్వానంగా మారాయని, గుంతలు పడిన చోట కనీసం మట్టి కూడా పోయలేదని విమర్శించారు.నల్లగొండ నియోజకవర్గంలో గతంలో తాను చేసిన అభివద్దే తప్ప ప్రస్తుతం ఎమ్మెల్యే చేసింది ఏమి లేదని ఎద్దేవా చేశారు.జండుబాం పెట్టుకొని ఏడవడం తనకు రాదని ,పేద ప్రజల కన్నీళ్లు తుడుస్తానన్నారు.బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్లు డబ్బులు తీసుకుని పార్టీ మారారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.పార్టీ మారిన ఏ ఒక్క కౌన్సిలర్‌కు డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.వారంతా ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చక నల్లగొండ అభివద్ధి కోసం నాతో కలిసి పని చేయడానికి వచ్చారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కేసాని వేణుగోపాల్‌రెడ్డి, భాస్కర్, సమద్, ఫసహత్ బాబా, కాంగ్రెస్ నాయకులు మునాస ప్రసన్న, బంగినపల్లిరవి, మునస నాగరాజు, నర్సింగ్ నవీన్, మునాస వినరు, వంగాల అనిల్‌రెడ్డి, మహమ్మద్ రఫీ, వహీద్, వాజిద్, కొత్తపల్లి గణేష్,దాసరి రవి,కిరణ్, ఇబ్రహీం, ఇంతియాజ్, హుస్సేన్, పయీమ్, పాశంనరేష్‌రెడ్డి,ఏడుదొడ్ల వెంకటరామిరెడ్డి,సూరెడ్డి సరస్వతి,పాదం అనిల్,జయకుమార్ పాల్గొన్నారు.