భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

మాజీ కౌన్సిలర్ అనిల్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిక

 నవతెలంగాణ -భువనగిరి

భువనగిరి పట్టణంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థానిక సాయి కన్వెన్షన్ హాల్ నుండి అర్బన్ కాలనీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అర్బన్ కాల్ లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్ కుమార్ సుమారు వంద మందితో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని కాంగ్రెస్ వస్తే ప్రజల తెలంగాణ వస్తుందని తెలిపారు. భువనగిరి పట్టణము లో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడని తెలిపారు. ఎన్నికల ముందు హడావుడి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని తప్పక రాష్ట్రంలో అధికారంలో వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వల్లందాస్ ఆదినారాయణ పట్టణ నాయకులు పాల్గొన్నారు.