ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్

– మండల మాజీ వైస్ ఎంపీపీ పాయం నర్సింగరావు
– రెండవ రోజు లింగాలలో విస్తృత ప్రచారం
నవతెలంగాణ – తాడ్వాయి
ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మండల మాజీ వైస్ ఎంపీపీ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాయం నర్సింగరావు విమర్శించారు. బుధవారం మండలంలోని లింగాల గ్రామంలో రెండు రోజుల నుండి విస్తృతంగా టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ను మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నరసింగరావు మాట్లాడుతూ గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారం లోకి వచ్చింది అని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. వరికి బొనస్ 500 ఇస్తామని రైతు భరోసా 15000 ఇస్తామని రుణమాఫీ చేస్తామని మహిళలకు 2500 ఇస్తామని ఇంకా విద్యార్థినులకు స్కూటర్లు ఇస్తామని ఇంకా అనేక మోసపూరిత హామీలిచ్చి అధికారం లోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ నీ ఓడించి, రైతు పార్టీ అయిన బిఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత గారి ని గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఊకె జగన్ చెన్నూర్ వెంకన్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.