బీసీలను విస్మరించిన కాంగ్రెస్‌

–  మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ బీసీలను విస్మరించిందని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత నగేష్‌ ముదిరాజ్‌కు గులాబీ కండువా కప్పి మంత్రి ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 2018లో తెలంగాణ ద్రోహులతో కలిసిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడూ అదే పని చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ కోరుతున్న ఒక్కసారి అవకాశమిస్తే ఆగమవుతామన్నారు. 24 గంటల కరెంట్‌ ఇచ్చే రాష్ట్రంలో 5 గంటలు కరెంట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతున్నదని తెలిపారు.