
యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గురువారం, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం గ్రామ శాఖ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాశ్ అధ్వర్యంలో ఇంటింటికి తిరిగి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల వర్కింగ్ ప్రెసిడెంట్, పి ఏ సి ఎస్ డైరెక్టర్ ఏమాల ఎలందర్ రెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు, బూత్ కన్వీనర్ కళ్లెం విజయ జహంగీర్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎం డి యాకుబ్, ఉపాధ్యక్షులు సింగం ఎల్లయ్య, , గజం యాదగిరి, సుంచు సురేష్, సుంచు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.