కాంగ్రెస్ గాలి.. ఖాలీవుతున్న కారు.?

– సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే దుద్దిళ్ల
నవతెలంగాణ-  మల్హర్ రావు
కాంగ్రెస్ గాలి తట్టుకోలేక రుద్రారం గ్రామంలో కారు ఖాలీవుతున్న పరిస్థితి నెలకొంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. దాదాపు గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతోపాటు పలువురు వంద మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.పార్టీలో చేరినవారిలో మాజీ ఎంపీటీసీ సబవత్ రాజేందర్, ముగ్గురు మాజీ వార్డు సభ్యులు కొమ్మెర స్వామి, సభావత్ కిషన్ నాయక్, రామ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు, కర్నే రాములు, గట్టయ్య, సంపత్, కుమారస్వామి, లస్మయ్య గొర్రె సంపత్, గాలి స్వామి, ఒడ్నల నరేష్, గట్టు సమయ్య, బీఆర్ఎస్ యూత్ నాయకులు గట్టుసతీష్, కొలిపక రాజయ్య, అంగ చేరాలు,పేరాల మురళి, పగడాల రాజయ్య, తోట శ్రీనివాస్, మల్లయ్య, కో లిపాక సదానందం, అప్పాల ఓదెలు,సమ్మయ,అయిత మరయ్య, అప్పల సారయ్య, సంగు ఐలయ్య, గుమ్మడి తిరుపతి, సభావత్ పాపయ్య నాయక్, కసర్ల బాలరాజు, బోత్ రాజ్, నర్సింహులు నాయక్, కమ్మగాని వెంకట స్వామి, వియగిరి దేవేందర్, సభవత్ చంద్ర శేఖర్, దుగ్యాల రాజ బాపు,నిమ్మల దేవేందర్, కొమ్మేర తిరుపతి, అప్పల రాజు కుమార్ , అయిటి పాముల పోచయ్య తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్, గ్రామశాఖ అధ్యక్షుడు భోగే మల్లయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గెం రమేష్,చిగురు సదయ్య,చెంద్రమొగిలి,గట్టయ్య పాల్గొన్నారు.