నవతెలంగాణ-ఆదిలాబాద్‌రూరల్
అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత అన్నారు. బుధవారం చాందా(టి) గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ గురించి వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500కి గ్యాస్ సిలిండర్‌తో పాటు ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేపడతామని హామీ ఇచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే వాటన్నింటినీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎంపిటిసి ఆరె పోచ్చన్న, మాజీ సొసైటీ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, లంక రాజు, వినోద్, డాక్టర్ మారుతి, సంతోష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాయిచరణ్‌గౌడ్, ఉప సర్పంచ్ మల్లయ్య, దండు మధుకర్, కన్య ప్రభాకర్‌రెడ్డి, రాకేష్, రాజేశ్వర్, మునిగెల నర్సింగ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్‌రెడ్డి పాల్గొన్నారు.