కాంగ్రెస్ గాలి విస్తోంది.. అధికారంలోకి రాబోతుంది.

– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ- మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తోందని, త్వరలోనే అధికారంలోకి రాబోతోందని శ్రీపాద ట్రస్టు చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని కొయ్యుర్, ఎడ్లపల్లి, వళ్లెంకుంట గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్యతో కలిసి విస్తృతంగా పర్యటించి మాట్లాడారు యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక యువతను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు.పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలైన మాహలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం చేయూత  తక్షణమే అమలు చేయనున్నట్లుగా తెలిపారు. ఎడ్లపల్లిలో 30 మంది, వళ్లెంకుంటలో 20మంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి శ్రీనుబాబు కండువాలు కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.మల్లారం,రావులపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీ కార్డులు ఇంటింటా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జనగామ స్వరూప బాపు, ఎంపిటిసి అవిర్నేని ప్రకాశ్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి,కాంగ్రెస్  మత్స్యశాఖ రాష్ట్ర కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ, జంగిడి సమ్మయ్య, లింగన్నపేట శ్రీదర్, రాజు నాయక్, రాజేశ్వర్ రావు, లింగన్నపేట రమేష్, సమ్మయ్య, జనగామ లక్ష్మీ రాజాం పాల్గొన్నారు.