అసత్యపు పోకడలతో కాంగ్రెస్ కాలయాపన..

Congress is wasting time with false trends..– ప్రజలను మభ్యపెట్టి..సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు.. 
– బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి… కాంగ్రెస్ నాయకుల కళ్ళకు కనబడడం లేదు..
నవతెలంగాణ – వేములవాడ 
అసత్యపు పోకడలతో కాంగ్రెస్ కాలయాపన..ప్రజలను మభ్యపెట్టి..సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు.. వేములవాడ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి వారానికి, 15 రోజులకు ఒకసారి అభివృద్ధి పేరిట అసత్యపు ప్రచారాలు చేస్తూ  కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళవారం విలేకరి సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ కౌన్సిలర్, సీనియర్ నాయకులు నిమ్మ శెట్టి విజయ్, సిరిగిరి చందు, వెంగళ శ్రీకాంత్ గౌడ్,  మాట్లాడుతూ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వారానికి ఒకసారి ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజలకు ఇది చేశాం.. అది చేశాం.  అంటూ అసత్యపు పోకడలతో కాలయాపన చేస్తున్నది, ఇప్పటివరకు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని పనులు చేశారో బహిరంగ చర్చకు రావాలని నిలదీశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్  ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గానికి ఆలయాల విస్తరణ పేరిట, రోడ్డు వెడల్పుల పేరిట, వంద పడకల ఆసుపత్రి పేరిట ఎంత అభివృద్ధి జరిగిందో కాంగ్రెస్ నాయకులకు కనబడడం లేదని ఎద్దేవా చేశారు. నిండు సభలో  బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు ఆడవారి నమ్ముకుంటే మోసపోక తప్పదని చివరికి జుబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సిందేనని మాట్లాడడం ఇంతవరకు సమంజసంమన్నారు.
దానికి నిరసనగా వేములవాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే.. దిష్టిబొమ్మలు ఎందుకు దగ్ధం చేస్తున్నారు..ఏంటో అర్థం కావట్లేదు అని.. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  అనడం శోచనీయంగా ఉందన్నారు.  బడ్జెట్లో 50 కోట్ల రూపాయల నిధులు వేములవాడ ఆలయానికి పెట్టామని విలేకరుల సమావేశంలో  చెప్పి తర్వాత రోజు రాజన్నకు కోడెముక్కులని, మరుసటి రోజు పాలాభిషేకాలని రోజులు గడుపుతున్నారే తప్ప అభివృద్ధి జరిగింది మాత్రం శూన్యం అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో కాంగ్రెస్ నాయకులు చూడాలని.. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే వారికి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని జోస్యం చెప్పారు.  ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్,  ఈర్లపల్లి రాజు,పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, కౌన్సిలర్ కుమ్మరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వాసాల శ్రీనివాస్, అంజద్ పాషా, దుర్ముట్ల వెంకటరెడ్డి, మైలారం రాము, కమలాకర్ రెడ్డి, రవిచంద్ర గౌడ్, ప్రేమ్ చారి, బత్తుల మహేందర్ యాదవ్, రాంబాబు, పోతు అనిల్ కుమార్, మంత సందీప్, ప్రమోద్, తుమ్మల దిలీప్, సంతోష్, లింగం రాకేష్, దమ్మ భాస్కర్, రఫీ, ఉమర్, యూసఫ్, అప్సర్, కుమార్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.