ప్రజలకు ఇచ్చిన హామీలకు కాంగ్రేస్ కట్టుబడి ఉంది

నవతెలంగాణ – వీర్నపల్లి 

ప్రజలకు ఇచ్చిన హామీలకు మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశం ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆరు గార్యంటి పథకాలలో భాగంగా ఆరోగ్యశ్రీ , ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి రెండు పథకాలను నెరవేర్చింది. అలాగే 27 న చేవెళ్లలో రెండు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీ అర్ ఎస్ పార్టీ నాయకులు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతు ప్రజలను ఆగమాగం చేస్తూ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు . ప్రజలకు వెన్నoటి ఉండే కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలు గాని ప్రజలకు వ్యతిరేకంగా గాని మాట్లాడినట్లయితే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని మాట్లాడరు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పని శివరామకృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తుడుం రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షులు చంద్రమౌళి, సీనియర్ నాయకులు జోగుల కాంతయ్య, లెంకల లక్ష్మన్, దేవయ్య, భూక్య మదన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.