
– బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించిన యువజన కాంగ్రెస్
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన అనంతరమే మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అమలుకు శ్రీకారం చుట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మంకాలి ప్రవీన్ శుక్రవారం తెలిపారు.పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ శ్రేణులు చేసిన ఆరోపణలను ప్రవీన్ ఖండించారు.గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో వైద్యం సహయం రూ.10 లక్షల పెంపుదల,రూ.500 గ్యాస్ సిలిండర్, విద్యార్థులకు ఉచిత పాఠ్య,నోట్ పుస్తకాలు,ఏకరూప దుస్తులు,అమ్మ ఆదర్శ కమిటీలతో పాఠశాల మరమ్మత్తు పనులు అమలు చేస్తూ ప్రజల సంక్షేమమే ద్యేయంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రవీన్ బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ హమీ ఇస్తే అమలు చేయడమే ప్రధాన లక్ష్యమని ప్రవీన్ తెలిపారు.