– టీపీసీసీ స్ట్రాటజీ కమిటీ చైర్మెన్ ప్రేమ్‌సాగర్‌రావు ధీమా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వస్తాయని టీపీసీసీ స్ట్రాటజీ కమిటీ చైర్మెన్ ప్రేమ్‌సాగర్‌రావు చెప్పారు. ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకుపోతున్నామన్నారు. అవసరమున్న వారితో మాత్రమే పొత్తులుంటాయని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుల అంశం అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట్ చిరాన్ ఫోర్ట్ క్లబ్‌లో స్ట్రాటజీ కమిటీ సమావేశమైంది. సభ్యులు సాగర్, ఈర్లపల్లి శంకర్, జంగయ్య యాదవ్, ఆడం సంతోష్‌కుమార్, కేఎస్ యాదవ్‌తోపాటు పలువురు కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ ఎన్నికల వ్యూహాలపై రూపొందించిన నివేదికను అక్టోబర్ మొదటి వారంలో అందజేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుఫాన్‌లా దూసుకుపోతోందన్నారు. పదేండ్ల కాంగ్రెస్ హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. అప్పుడే వడ్ల కొనుగోలు కేంద్రాలున్నాయనీ, ప్రస్తుతం వడ్ల కొనుగోళ్లల్లో పెద్ద స్కాం జరుగుతోందని ఆరోపించారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తోందని చెప్పారు.