ఫార్ములా ఈ- రేస్‌ రద్దు పట్ల కాంగ్రెస్‌ హర్షం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఫార్ములా ఈ-రేస్‌ వల్ల గతంలో హైదరాబాద్‌ నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ గుర్తు చేశారు. అందుకే రేస్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదన్నారు. శనివారం శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వం ట్రాఫిక్‌ను స్తంభింప చేసి అవివేక నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ప్రజలు ట్రాఫిక్‌ ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. రేస్‌ వల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదని చెప్పారు. ఈ రేస్‌ల వల్ల పెట్టుబడులు వస్తాయంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పడం తెలివి తక్కువ తనమని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ కోటా కింద రెండు స్థానాలు ఖాళీగా ఉన్నా ఎన్నికలు వేరువేరుగా జరుగుతాయని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసిందన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాగే జరిగాయని చెప్పారు.