– కాంగ్రెస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునితా మహేందర్ రెడ్డి
– కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలి : తోటకూర వజ్రేష్ యాదవ్
నవతెలంగాణ-కీసర
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు పరుస్తుందనికాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పట్నం సునితా మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కీసరలోని కె.బీ.ఆర్ కన్వీన్షన్ హల్‌లో ఉమ్మడి కీసర మండల కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సునితా మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ తోట కూర వజ్రేష్ యాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భ ంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముందుం టుందన్నారు. కాంగ్రెస్‌తోనే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్నారు. వంద రోజుల పాలనలో 30 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత మన ప్రభుత్వానికే దక్కిందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇలా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, కొన్ని రోజులు పార్టీ కోసం కష్టపడి పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ స్థానాలు గెలిస్తే ఢిల్లీలో సీఎం రేవంత్‌కు బలం పెరుగుతుందని, కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని, తద్వారా మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుం దన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలన్నారు. అంతకు ముందు కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని వారు దర్శించు కున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేం దర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమం తరావు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, జెడ్పీ చైర్మెన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,ఉమ్మడి కీసర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ రామి డి విజరు రెడ్డి ,కీసర గ్రామ శాఖ అధ్యక్షుడు జూపల్లి రవీందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మేడ్చల్ : మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలు,నాయకులు కషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం మేడ్చల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మేడ్చల్ ఉమ్మడి మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు.ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు,బాగా కష్టపడి పనిచేయాలని అభ్యర్థి గెలుపునకు సహకారం అందించాలని కోరారు. నాయకులు, కార్యకర్తల సమిష్టి కషితో గెలుపు సాధ్యమైతుందని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకెళ్లి పనిచేయాలని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు ప్రజల అభీష్టం మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి కోట్లాది నిధులతో అభివద్ధి పనులు చేశానని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తా మన్నారు.రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తీసుకొచ్చి,అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి నియోజకవర్గం అభివద్ధికి తోడ్పాటున అందిస ా్తనని పేర్కొన్నారు.కార్యక్రమంలో మేడ్చల్ నియోజ కవర్గ ఇన్ చార్జి తోటకూర వజ్రష్ యాదవ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి,మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,మండల అధ్యక్షుడు రమణారెడ్డి,మున్సిపల్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,సాయి పేట శ్రీనివాస్ యాదవ్,జడ్పిటిసి శైలజ విజయానందా రెడ్డి,ఆర్.మల్లారెడ్డి,సింగరేణి పోచయ్య, వేణుగోపాల్ రెడ్డి,కౌన్సిలర్లు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.