– రెండో స్థానంలో బీఆర్ఎస్..
– మొగ్గ తొడుగు తున్న కమలం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పార్లమెంట్ ఎన్నికల్లో అశ్వారావుపేట లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ప్రతీ బూత్ లోను ఈ పార్టీ అభ్యర్ధి రఘురామిరెడ్డి తన సత్తా చాటారు. ఆరు నెలలు క్రితం వరకు అధికారం లో ఉన్న టీఆర్ఎస్ రెండో స్థానంలో వెనుకబడింది.ఎం.పీ గా రెండు సార్లు పనిచేసిన నామ నాగేశ్వరరావు ద్వితీయ స్థానం కొత్తగా పోటీ పడ్డా రామ సహాయం వెనుక నిలబడాల్సి వచ్చింది. ఈ నియోజక వర్గంలో నూ భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి వచ్చింది.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పార్టీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు వేలల్లో ఓట్లు సాధించడంతో కమలం వికసించింది.
మండలం పార్టీ
కాంగ్రెస్ బీఆర్ఎస్ భాజపా
ముల్కలపల్లి 12873 6107 1801
చండ్రుగొండ 11562 5327 1269
అన్నపురెడ్డిపల్లి 7795 3975 839
దమ్మపేట 22341 8648 2483
అశ్వారావుపేట 21545 9132 2891
మొత్తం 76116 33183 9283
ఈ నియోజక వర్గంలో మొత్తం 159174 మంది ఓటర్లకు గానూ 128848 మంది ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.