ప్రచారంలో తడాఖా చూపిస్తున్న పసర కాంగ్రెస్

నవతెలంగాణ-గోవిందరావుపేట: నామినేషన్ల పర్వంలో భాగంగా బుధవారం మండలంలోని పసర గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. వందలాది  కార్యకర్తలు ఉదయం పూటనే కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకొని ములుగు లో సీతక్క నామినేషన్ దాఖలుకు పెద్ద సంఖ్యలో కదలి వెళ్లారు. భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ వేసిన రోజే గెలిచినంత సంబరాలు జరుపుకున్నారు. నామినేషన్ పర్వం కార్యకర్తల్లో నూతన జోష్ నింపుతోందని స్థానిక కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రి అజ్మీర చందూలాల్  పై గత ఎన్నికలలో 22 వల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించిన సీతక్కకు ఈసారి 50వేల పైచిలుకు మెజారిటీ వస్తుందని సీనియర్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం నియోజకవర్గాన్ని వంటి చేత్తో శాసించిన మంత్రిని ఓడించిన సీతక్క ఈసారి సునాయాసంగా విజయాన్ని అందుకుంటుందని కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు
గెలుపు పై నూటికి 200 శాతం దీమాతో ఉన్నారు.