రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

– డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌
నవతెలంగాణ-చేవెళ్ల
రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజిఆర్‌ గార్డెన్‌లో చేవెళ్ల నియోజకవర్గం సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం జన్మదిన వేడుకలకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికీ, కార్య కర్తలు, నాయకులు పార్టీకి అండగా ఉండి ముందుకు నడిపిస్తున్నారని గుర్తుచేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ వస్తుం దని ధీమా వ్యక్తం చేశారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సున్నపు వసంతం శాలువా కప్పి, కేక్‌ కట్‌ చేయించి స్వీట్లు పంచుకున్నారువారు.
చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం జన్మదిన వేడుకలు చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు. నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్‌, మొయినాబాద్‌, నవాబ్‌ పేట్‌, శంకరపల్లి తదితర మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, యువకులు భారీ పూల దండ, శాలువా కప్పి చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ కులు సున్నపు వసంతంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీ ర్యాలీతో అంబేద్కర్‌, పూలే, బాబుజగ్జీవన్‌ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సమ న్వయ కమిటీ అధ్యక్షులు చింపుల సత్య నారాయణ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు జనార్ధన ్‌రెడ్డి, చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజ ఆగిరెడ్డి, చేవెళ్ల సొసైటీ చైర్మ న్‌ దేవర వెంకటరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, ముడిమ్యాల సొసైటీ చైర్మన్‌ ప్రతాపరెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీని వాస్‌గౌడ్‌, పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు వీరేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ చేవెళ్ల మండల ఉపాధ్యక్షులు మల్లేష్‌ యాదవ్‌, పాండు యాదవ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్‌, ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.