రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

నవతెలంగాణ-గోవిందరావుపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ అన్నారు.శుక్రవారం మండలంలోని  చల్వాయి గ్రామంలో పోశాల రాజకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ ముఖ్య అతిధిగా హాజరు కావడం జరిగింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా గనపాక సుధాకర్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6గ్యారంటీ హామీలను వివరిస్తూ వాటితోపాటుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రములో అధికారం లో కి రాభోతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే18సంవత్సరాలు నిండి పై చదువులు చదువుకునే మహిళలకు ఎలక్ట్రైకల్    స్కూటి ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులకు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చెయ్యడం జరుగుతుంది. అదేవిదంగా ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ఏర్పాటుచేయ్యడం జరుగుతుంది. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది. డిగ్రీ ఆ పై చదువులకు 5లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది. SC, ST వర్గాల ప్రజలకు 12లక్షలు ఆర్థికసహాయం అందజేయడం జరుగుతుంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 25000రూపాయలు పింక్షన్ గా ఇస్తూ ఇంట్లో ఒకరికి ఉద్యోగం. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇల్లు కట్టుకోడానికి 6లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మద్యం బెల్ట్ షాపులు రద్దు చేయడం జరుగుతుంది.పై విదంగా ఇంటింటి ప్రచారం చేస్తూ “చేతిగుర్తు ” కే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రములో గెలిపించి అధికారంలోకి తీసుకోనిరావాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో చల్వాయి ఎంపీటీసీ 1, గుండె బోయిన నాగలక్ష్మి, అనిల్ యాదవ్, BC సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసార్ల రాంబాబు, బూత్ ఇంచార్జి దేవర పెళ్లి మల్లారెడ్డి, గ్రామ ఉపాధ్యక్షులు కందాల వెంకన్న, గ్రామ కార్యదర్శి గొల్ల పూడి సాంబశివరావు, సీనియర్ నాయకులు పెద్ద పురం మొగిలి, సాంబాలక్ష్మి ముద్దసాని సాయి, లూకాస్, జక్కీ ప్రభాకర్, నరాల సమ్మిరెడ్డి, జక్కీ వికాస్ రాజ్, గుండె రమేష్ వివిధ నాయకులు పాల్గొన్నారు.