
నవతెలంగాణ-మునుగోడు : పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ విడుదల చేసిన ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఆరో వార్డులో గడపగడప తిరుగుతూ 6 గ్యారంటీలపై ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోనే సాధ్యమని నియోజకవర్గంలోని ప్రజలు కాంగ్రెస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎంతోమంది కుటుంబాలకు ఆపదలో అండగా ఉన్న రాజన్న గెలుపు కోసం నియోజకవర్గం లోని ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని తెలిపారు . మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయం కానీ రాష్ట్రంలోనే కాంగ్రెస్కు మునుగోడు నియోజకవర్గ మెజార్టీ కోసం ప్రతి కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జిట్టగోని యాదయ్య , సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను , మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి అన్వర్ , ఆరేళ్ల సైదులు , పందుల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.