కాంగ్రెస్ తోనే యువత భవిష్యత్తు 

– కవ్వంపల్లి యువసేనా అధ్యక్షుడు కత్తి రమేశ్ సూచన 
– దోచుకుని బీఆర్ఎస్ నాయకులు ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపణ
– రాబోయే ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ కు పట్టం కట్టాలని విజ్ఞప్తి 
నవతెలంగాణ – బెజ్జంకి 
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నుండి రాష్ట్రంలో యువత ఎన్నో ఉన్నత చదువులు చదివి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో యువత నయవంచనకు గురై ఉద్యోగం,ఉపాధిలేక నిరుద్యోగులుగా జీవనం సాగిస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కవ్వంపల్లి యువసేనా అధ్యక్షుడు కత్తి రమేశ్ సూచించారు.శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారంటీలపై సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణులకు కత్తి రమేశ్ వివరించారు. గత తొమ్మిదన్నరేళ్లుగా ఉద్యోగాల నోటిపీకేషన్ పేరుతో యువతను నయవంచనకు గురిచేసి పరీక్షల పేరుతో  వసూలు చేసిన రుసుంలను ఆసరా, ఇతరత్రా సంక్షేమ పథకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిందని అగ్రహం వ్యక్తం చేశారు.అదే అదునుగా భావించిన రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి పేరునా ప్రజాధనాన్ని దోపిడీ చేసి దాచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరువల్ల రాష్ట్ర ప్రజలందరూ అణచివేతకు గురయ్యారని..రాబోయే ఎన్నికల్లో ప్రజలు,యువత తెలంగాణ రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకువచ్చి దోపిడీ ప్రభుత్వానికి స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు.నాయకులు మానాల రవి,వడ్లకొండ శ్యాం,కర్రావుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.