మహిళలకు సముచిత గౌరవం కల్పించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ ..

Congress is the only party that has given proper respect to women.– వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..
నవతెలంగాణ – వేములవాడ 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడాన్ని వేములవాడ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం తీవ్రంగా ఖండించారు.  పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ సర్దార్ పాపన్న విగ్రహం ముందు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లారా ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపాలని, రాష్ట్రంలో మహిళలకు సముచిత గౌరవం కల్పించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, నాయకులు చిలుక రమేష్, పుల్కం రాజు, పాత సత్యలక్ష్మి, ముప్పిడి శ్రీనివాస్, ఇప్ప పూల అజయ్, ఫిర్ మహమ్మద్, ముప్పిడి శ్రీధర్, కొక్కుల బాలకృష్ణ, ఎర్ర శ్రీనివాస్, సాబీర్ తో పాటు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.