57 మందితో కాంగ్రెస్‌ మూడో జాబితా

– రాష్ట్రంలో ఐదు స్థానాలకు అభ్యర్థుల ఖరారు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబం ధించి కాంగ్రెస్‌ 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. గురువారం విడుదల చేసిన ఈ జాబి తాలో తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. పెద్ద పల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి సునీతా మహేందర్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ దానం నాగేందర్‌, చేవెళ్ల గడ్డం రంజిత్‌ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ నుంచి మల్లు రవిలను ఖరారు చేసింది. కాగా, ఇప్పటికే నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం విదితమే. అయితే తాజాగా విడుదల చేసిన జాబితాలో ఐదుగురిలో ముగ్గురు ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరినవారే కావడం గమనార్హం. కర్నాటక (17), గుజరాత్‌ (11), మహారాష్ట్ర (7), రాజస్థాన్‌ (6), పశ్చిమ బెంగాల్‌ (8), తెలం గాణ (5), అరుణాచల్‌ ప్రదేశ్‌ (2), పుదుచ్చేరి (1) చోప్పున రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 మంది అభ్యర్థు లతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. అయితే రాజ స్థాన్‌లో ప్రకటించిన ఆరు స్థానాలకుగాను ఐదు చోట్ల కాంగ్రెస్‌, ఒక నియోజకవర్గంలో సీపీఐ(ఎం) పోటీ చేస్తుంది.