– సాదరంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న జనరంజక పాలన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి వివిధ పార్టీల నుండి పలువురు సోమవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామం నుండి కాంగ్రెస్ , బీజేపీ నుండి రమేష్ నాయక్ (కాంగ్రెస్), మంగ్య నాయక్, శివకుమార్ నాయక్, రాజేష్ నాయక్, భీమా నాయక్, మోహన్ నాయక్, హరీష్, తిరుపతి(బీజేపీ), గంగాధర్, శ్రీనివాస్, కె.గంగాధర్ తదితరులు పార్టీలో చేరారు. భీమ్ గల్ మండలం బడా భీంగల్ గ్రామం నుండి గౌడ సంఘం సభ్యులు, యువజన సభ్యులు,
వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామం కాంగ్రెస్ నుండి రిక్క రాజన్న, బన్న రంజిత్, గుట్ట వడ్డెర కాలనీ ప్రభాకర్, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ధర్మోరా గ్రామం నుండి బిజెపి రాష్ట్ర ఎస్టి మోర్చా సభ్యులు, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు దేగామ్ రాజేశ్వర్, కాంగ్రెస్ నుండి యేలేటి మహిపాల్, ఆబ్కా ధర్మయ్య, ముప్కాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నుండి మైనారిటీ సీనియర్ నాయకులు మూకీద్, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
ఏకగ్రీవం తీర్మానం…
భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామ గూండ్ల సంఘం సభ్యులు అభివృద్ది ప్రదాత వేముల ప్రశాంత్ రెడ్డికే మా ఓటు అంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి ముక్త కంఠంతో నినదించారు. అందుకు సంబంధించిన తీర్మాన పత్రాలు మంత్రికి అందజేశారు.ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మాణం చేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు..