వడదెబ్బతో కాంగ్రెస్ నాయకుడు మృతి

– మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి 
నవతెలంగాణ – మల్హర్ రావు
వడదెబ్బతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పల్నాటి రమేష్ (50) మృతి చెందిన సంఘటన మండలంలోని మల్లారం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.కుటుంబ సభ్యుల, స్థానికుల పూర్తి కథనం ప్రకారం రమేష్ మే 28న మంగళవారం మధ్యాహ్నం ఎండలో  వచ్చి అంతా గవరా గాబరా అవుతుందని ఇంట్లో భార్యకు చెప్పి,స్తానం తల తిరుగుతుంది కింద పడిపోయి సృహ కోల్పోయినట్లుగా తెలిపారు.చికిత్స కోసం వెంటనే కరీంనగర్ లోని చల్మడ ఆనందరావు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజిఎం వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లుగా తెలిపారు.కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబం రోడ్డున పడిందని ఆర్ధికంగా ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు  విజ్ఞప్తి చేస్తున్నారు.అసలే రోహిణి కార్తె కావడంతో తన ప్రతాపాన్ని చూపుతోంది.ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.