సర్పంచ్ విజయను పరామర్శించిన కాంగ్రెస్ నాయకురాలు పూజ

నవతెలంగాణ – అశ్వారావుపేట
ములకలపల్లి మండలం, పూసుగూడెం సర్పంచ్ విజయను శుక్రవారం టీపీసీసీ సభ్యురాలు వగ్గెల పూజ పరామర్శించారు. ఇటీవల విజయ కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న  పూజ ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. పూజ వెంట సీనియర్ నాయకులు షేక్ ఖాదర్ బాబా, ఎస్.సి సెల్ మండల అధ్యక్షులు పాలకుర్తి రవి, యువజన విభాగం సోషల్ మీడియా జిల్లా కో – ఆర్డినేటర్ ఎస్.కె బషీర్, ములకలపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు గుంపుల రవితేజ,నల్లి రాము,గంటా రాము, తన్నీరు శ్రీకాంత్, జరుపుల బాలాజీ, కంపాటి బ్రదర్స్ మురళి, నాగరాజు (పండు), కొయ్యల బాలరాజు, సయ్యద్ షా బాబా, మందరపల్లి వార్డు మెంబర్ వెంకయ్య, సీనియర్ నాయకులు లంక గాంధీ తదితరులు పాల్గొన్నారు.