
ఇమాంపేట వద్ద ఉన్న కస్తూరిబా గురుకుల పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడిన దగ్గుపాటి వైష్ణవి కుటుంబాన్ని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి పరామర్శించారు. సోమవారం స్థానిక ఇందిరమ్మ కాలనీలో గల వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి వైష్ణవి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికీ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షఫీ ఉల్లా, నాయకులు గట్టు శ్రీను, జానకిరామ్ నాయక్, వల్దాస్ దేవేందర్, తండు శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.