– క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావాలు :కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రి, ఆ పార్టీ నేతలు తనపై చేసిన ఆరోపణలు నిరాధారం, మతిలేనివని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే లీగల్ నోటీసులు, పరువు నష్టం దావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వాస్తవాలను సరి చూసుకోకుండా ఇలాంటి చెత్త వార్తలను ప్రచురించే మీడియా సంస్థలకు లీగల్ నోటీసులను పంపిస్తామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ అంశంలో ప్రధానంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.